Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: అశ్వ మేధం - ఎపిసోడ్ - 1 | Aswamedham - Episode - 1 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అశ్వ మేధం - ఎపిసోడ్ 1
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
హేమంతం! ఉదయం పదిగంటలైనా దేశ రాజధానిలో పొగమంచు వీడలేదు. దారి కనిపించనంతటి మంచు. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల 9.00 గంటలకు చేరవలసిన ఫ్లైట్ అరగంట ఆలస్యంగా చేరింది.చరణ్ త్వరగా ఫ్లైట్ దిగి అరగంటలో బయటకొచ్చాడు. టాక్సీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి బయలు దేరాడు. అక్కడికి చేరుకునే సరికి 10.30 అయింది. అప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కాబట్టి ఎన్రోల్మెంట్ అవీ ఉంటాయి.అతను ఆహాలు దగ్గరకు వచ్చి "మే ఐ కమిన్" అన్నాడు.డయాస్ మీద అభ్యర్ధులతో మాట్లాడుతున్న ప్రొఫెసర్ అతని వైపుతిరిగి 'కమిన్' అన్నాడు. "సారీసర్... ఫ్లైట్ లేట్... మైనేమ్ ఈజ్ చరణ్ ఫ్రం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్" అన్నాడు తన వివరాలున్న పేపర్ ఇస్తూ.అప్పటికే ఆ హాలు అభ్యర్థులతో నిండిపోయింది. ఫేను చప్పుళ్ళు తప్ప హాలంతా నిశ్శబ్దం గా ఉ౦ది.అది యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్... దేశంలోని ప్రముఖ న్యాయ కళాశాలల్లో అదొకటి; జె యన్ యూ కి సంబంధించిన కాలేజి. ఆ సెంటర్ భారతదేశ రాజ్యాంగం - చట్టాలు - పీనల్ కోడ్ మీద వారం రోజులు షార్ట్ టర్మ్ కోర్సు' నిర్వహిస్తోంది.వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ లా కాలేజిల్లో చదివిన విద్యార్థులు, లాయర్లు దానిని హాజరవుతున్నారు. చరణ్ రెండేళ్ళ క్రితం యూనివర్సీటీ కాలేజీలో 'లా' పాసయ్యాడు. యూనివర్సీటీ గోల్డ్ మెడలిస్ట్; రెండేళ్ల నుంచి ఒక ప్రముఖ లా సిండికేట్లో ప్రాక్టీసు చేస్తున్నాడు. దాంతో పాటు పల్లెకు దగ్గర్లోని చిన్నపట్నంలో లా ప్రాక్టీసు చేస్తూ పేదవాళ్ళకు ఉచితంగా కేసులు వాదిస్తున్నాడు.ఈ కోర్స్ చాలా మంచిదనీ, హజరైతే మంచిదనీ చెప్పి, లక్షరూపాయలు ఫీజు కట్టి ఢిల్లీ వచ్చాడు;. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తైన తరువాత క్లాసు ప్రారంభమైంది.మొదటి క్లాసు అది... తెల్లటి బట్టలు వేసుకున్న ఆరడుగుల వ్యక్తిలోనికి వచ్చి "నాపేరు శుక్లా.... ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్" అని తనను పరిచయం చేసుకున్నాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video linkhttps://youtu.be/VgSFVGZXeyE