Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: మనసుపాడింది సన్నాయిపాట | manasu Padindi Sannaayi Pata | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
Description: మనసుపాడింది సన్నాయిపాట
రచన: యశోద పులుగుర్త
రత్తమ్మ ఆ ఊరివారందరకూ తలలో నాలుకలా ఉంటుంది.. పేరు రత్తమ్మ అయితే ఆమె ఆ ఊరిలోని చిన్నా, పెద్దా అందరికీ రత్తమ్మత్తగా స్తిరపడిపోయింది.. ఆమె భర్త మల్లన్న .. ఆ ఇద్దరి దంపతులకూ ఎంతో కాలం తరువాత పుట్టిన కూతురు " నందిని " ..
తమ నోముల పంట, వరాలమూట అయిన నందిని అంటే ఆ తల్లితండ్రులకు పంచప్రాణాలు..
నందిని ఒక అందమైన అమ్మాయి బొమ్మలా ఉంటుంది. కళ్ళ దగ్గర రెండు కలువలుంచాడు ఆ బ్రహ్మ. ముక్కుండాల్సిన చోట ఒక సంపెంగ పువ్వు, పెదాలకు బదులు రెండు దొండపండ్లు, మెడ దగ్గర శంఖమూ, చేతులూ కాళ్ళూ తామర తూళ్ళూ– ఇలా ఒక ప్రబంధ సుందరిని తలపించేలా ఉంటుంది నందిని..
ఉన్న రెండెకరాల పొలం లో వ్యవసాయం చేసుకుంటూ గేదెలనూ ఆవులనూ మేపుకుంటూ, పాలూ పెరుగూ నెయ్యీ అమ్ముకుంటూ తమ గారాలపట్టీని ఏలోటూ లేకుండా పెంచుకుంటున్నారు..
నందిని అన్నింట్లోనూ చురుకే.. మహా తెలివైనది.. ఆ ఊర్లోనే ఉన్న స్కూల్లో పదోక్లాస్ చదివి రాష్ట్ర స్తాయిలో నే మొదటి రేంక్ విద్యార్ధినిగా నిలబడింది...
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/UmxMdgqubeU