Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: సొట్టలు | Sottalu | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సొట్టలు
రచన: భాగవతుల భారతి
"టాంగ్ ఠాంగ్.. ఏమిటీ సౌండ్ పొల్యూషన్
ఆపవయ్యా..నీగోల" అంది చెవులు మూసుకుంటూ వనజ.
"అదేంటమ్మగారూ!? ఈ రోజుల్లో ఇత్తడి, రాగి
సామాన్లు ఎవరు వాడుతున్నారండీ...
ఈ రాగి బిందెకు సొట్టలు తీయమని మీరేగా నన్ను పిలిచారూ... సొట్టలు తీయాలంటే సుత్తితో సుతిమెత్తగా కొట్టాలి గదండీ!? అవునూ! సొట్టలుతీసి, చింతపండూ ఉప్పూవేసి తోమేసి, మీ బామ్మగారి గుర్తుగా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా " అన్నాడు సొట్టలు తీసే అతను.
ఆలోచనలో పడింది వనజ.
ఫోన్ రింగైతే లిఫ్టు చేసింది.
"హలో వనజా ఏంచేస్తున్నావ్?" అంది వనజ స్నేహితురాలు.
"నా పెళ్ళికి బామ్మ అందరిలా కాకుండా వెరైటీగా, పాత రాగి బిందెను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇస్తూ, ‘వనజా! నేనున్నా లేకున్నా ఈ బిందె చూడగానే ఈ బామ్మే గుర్తురావాలి నీకు.... ఇవాళా రేపు రాగి, ఇత్తడీ ఎవరూ వాడట్లేదు. అందుకని ఆ వంకతో ఈ బిందె ఎప్పుడూ అమ్మాలని గానీ, మార్చి వేరే వస్తువు తీసుకోవాలని గానీ ప్రయత్నించకు’ అని చెప్పింది. అందుకని నేను ఇల్లు మారినప్పుడల్లా, దీన్ని కూడా, నాతో తెస్తూనే ఉన్నా. ఇప్పుడు... నేనూ, సందేష్ విడిపోవాలనుకున్నాం గా..
ఈ బిందెకూడా నాతో తెచ్చా. సొట్టలు పడి, మకిలి పట్టిందిగా.... కాస్త రిపేర్ చేసీ.... " అంటూ ఆగి ఎందుకో ఆలోచనలలో పడింది వనజ.
"నీ విడాకులు ఎక్కడిదాకా వచ్చినాయ్? నువ్వడిగిన భరణం ఇస్తానన్నాడా? గురుడు. " అడిగింది స్నేహితురాలు.
సమాధానం చెప్పని వనజని....
"ఏంటీ.. ఫోన్ చేతుల్లోనే ఉంచుకుని ఏంటంత పరధ్యానం ? ఏమాలోచిస్తున్నావ్ " రెట్టించింది.
"అదీ! … విడాకుల కేస్ వాపస్ తీసేసుకుందామను కుంటున్నాను." అంది వనజ.
"అదేమిటే!? డైవోర్స్ తీసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా వనుకున్నాము" ఆశ్చర్యంగా అంది వనజ స్నేహితురాలు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/UPqeNBaiNzU