Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: తరాల_అంతరాలు | Tharala Antharalu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
తరాల అంతరాలు
రచన: నీరజ హరి ప్రభల
" ఏమండీ! మన అమ్మాయి సుధకి రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలిట. ఇందాకే తను చెప్పింది." అంది శ్యామల, భర్త రామయ్యతో.
"అలాగేలేవే! చూద్దాం. ఈనెల జీతం ఇంకా రాలేదు" అని ఆఫీసుకు వెళ్లాడు రామయ్య.
ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామయ్య- భార్య శ్యామల, కూతురు సుధతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. చదువంటే ఇష్టంతో చిన్నప్పటినుంచి కష్టపడి చదువుతూ ఇప్పుడు డిగ్రీ ఆఖరి సం.. చదువుతోంది సుధ. తమ ఇంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు తెలుసుకుని నడుచుకుంటూ తల్లి తండ్రులకు అనుకూలంగా ప్రవర్తించే సుధ అంటే వాళ్లకు ప్రాణం.
ఆ సాయంత్రం ఆఫీసునుంచి వస్తూనే జీతం డబ్బులను తెచ్చి భార్య చేతికిచ్చి అందులో సుధకు ఫీజు కట్టమన్నాడు రామయ్య. శ్యామల సుధను పిలిచి ఫీజుకు డబ్బులు ఇచ్చింది. ఈ సం… చదువు పూర్తవగానే ఏదన్నా ఉద్యోగం చేసి సంపాదిస్తూ తండ్రికి చేదోడుగా ఉండాలని అనుకుంది సుధ. సుధ పెళ్లి కోసం ఒక చిట్ ఫండ్ కంపెనీలో చీటీ కట్టి డబ్బులు దాస్తున్నాడు రామయ్య. కాలం గడుస్తోంది. ఒక రోజున చిట్ ఫండ్ కంపెనీ వాళ్లు బోర్డ్ ఎత్తేసి పరారైనట్లు విని రామయ్య హతాశుడయ్యాడు. ఆదరాబాదరాగా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ తనలాంటి ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు ఆఆఫీసుకు సీల్ వేసి కేసు నమోదు చేసుకుని ఎవరెవరు ఎంతెంత కట్టారో తెలుసుకుని వ్రాసుకుంటున్నారు. రామయ్య కూడా తనెంత కట్టాడో వివరాలు చెప్పి ఇంటికి వచ్చాడు. జరిగింది భార్యతో, సుధతో చెప్పి బాధపడ్డాడు. వాళ్లిద్దరూ ఆయన్ని ఓదార్చారు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/6Xi-l0PuVNw