Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: వీరి మధ్యన... ఎపిసోడ్ 2 | Veeri Madhyana Episode 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి
వీరి మధ్యన... ఎపిసోడ్ 2
రచన: బివిడి ప్రసాదరావు
గత ఎపిసోడ్ లో
పెళ్లి చూపులకు ముందుగా సాహసి పంపిన వీడియో చూస్తాడు సామ్రాట్.
ఇద్దరికీ పెళ్లి చూపులు జరుగుతాయి.
పెళ్లి చూపుల్లో సామ్రాట్ అడిగిన కొన్ని ప్రశ్నలు తనకు నచ్చనట్లు చెబుతుంది సాహసి.
ఇక వీరి మధ్యన.. రెండవ భాగం చదవండి...
"నేను మంచోడ్ని అని స్టాంపు వేసుకోను కానీ, చెడ్డవాడ్ని మాత్రం కాదు. నిన్నే కాదు ఎవర్నీ ఇబ్బంది పరిచే వాడిని కాదు. ప్రామిస్. నమ్ము." చెప్పాడు సామ్రాట్.
"థాంక్యూ" ఆగి చెప్పింది సాహసి.
"సంతోషం." అన్నాడు సామ్రాట్.
"కాల్ కట్ చేస్తాను." చెప్పింది సాహసి.
"ఒన్ మినిట్. నీ ఫోటో పంపరాదూ." అన్నాడు సామ్రాట్ మెల్లిగా.
"ఫోటోనా." అంది సాహసి వెంటనే.
"ప్లీజ్. డోన్ట్ థింక్ అదర్వైజ్. నీకు ఇష్టమైతేనే. సరేనా." అనేశాడు సామ్రాట్.
అర నిమిషం తర్వాత, "వాట్సాప్ కు పంపుతా." చెప్పేసింది సాహసి.
"మహా భాగ్యం. థాంక్యూ." చెప్పాడు సామ్రాట్.
ఆ కాల్ కట్ చేసేక, నిండుగా ఊపిరి పీల్చుకుంది సాహసి.
***
"అన్నా నమస్తే." అంటూ సామ్రాట్ కేబిన్ లోకి వచ్చాడు రమేష్.
సామ్రాట్ కో ఎంప్లాయ్ రమేష్.
"టీ టైం. రా. బయటికి వెళ్లి వద్దాం." చెప్పాడు రమేష్.
"ఫ్యూ మినిట్స్." అంటూ తిరిగి వర్క్ ను కొనసాగించాడు సామ్రాట్.
ఐదు నిమిషాలు లోపే, ఇద్దరూ టీ కై కదిలారు.
టీ తాగుతూ, "రేపు మా ఊరు వెళ్తున్నాను." చెప్పాడు రమేష్.
"వీక్ ఎండ్ కూడా కాదు. ఏంటీ అర్జంట్." అడిగాడు సామ్రాట్.
"మా వాళ్లు ఏదో పెళ్లి సంబంధం చూశారట. పిల్లను చూడ్డానికి ఊరెళ్లాలంటే, వెళ్తున్నాను." చెప్పాడు రమేష్,
"గుడ్. గో హెడ్. అన్నట్టు, ఈ మధ్య నేనూ పిల్లను చూశాను. సంబంధం కుదిరింది." చెప్పాడు సామ్రాట్ చిన్నగా నవ్వుతూ.
"కంగ్రాట్స్ అన్నా." చేయి చాచాడు రమేష్.
ఆ చేతిని అందుకుంటూ, "థాంక్యూ." చెప్పాడు సామ్రాట్.
"ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయేనా. నేను మాత్రం మన ఫీల్డ్ అమ్మాయినే ఎంపిక చేసుకుంటాను." అన్నాడు రమేష్.
ఖాళీ కప్పును పక్కన పెట్టి, "బ్యాంక్ ఎంప్లాయి." చెప్పాడు సామ్రాట్.
రమేష్ ఖాళీ కప్పును పక్కన పెట్టాడు. ఏమీ అనలేదు.
ఇద్దరూ తిరిగి అక్కడ నుండి తమ పనులకై కదిలారు.
"అమ్మాయిది ఏ ఊరు. పెళ్లి తర్వాత ఇక్కడకు ట్రాన్స్ఫర్ కాగలదా. లేదా ఉద్యోగం మానేస్తుందా. లేదా మానిపించేస్తున్నావా." అడిగాడు రమేష్.
"వరంగల్. ఇక్కడ బ్రాంచీకి మారొచ్చట. తనకు ఉద్యోగం చేయడమంటే ఇష్టమట" సామ్రాట్ చెప్పాడు.
"అచ్ఛా. అమ్మాయి ఎలా ఉంటుంది. ఫోటో చూపుతావా." నవ్వేడు రమేష్.
సామ్రాట్ తన వాట్సాప్ లోకి ఉదయమే చేరిన సాహసి ఫోటోను రమేష్ కు చూపాడు.
ఫోటోలోని సాహసిని చూస్తూనే, "ఈమా." అన్నాడు రమేష్.
"ఈమె నీకు తెలుసా." అడిగాడు సామ్రాట్.
"య. ఈమె డిగ్రీలో నా క్లాస్మేట్." చెప్పాడు రమేష్.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/nAQeQwn6GHE