Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: శ్రీరామ నవమి సంబరాలు | Srirama Navami Sambaralu | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
శ్రీరామ నవమి సంబరాలు
రచన : M R V సత్యనారాయణ మూర్తి
శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి . . . . .
శ్రీరాముడు …
ఈ పేరు చెబితే యావద్భారత దేశం పులకించిపోతుంది, పరవశించి పోతుంది.
చిరంజీవి హనుమ నోట నిరంతరం పలికే మహిమాన్విత ‘రామ’ నామం ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుని తమ జీవనగమనాన్ని సుసంపన్నం చేసింది. శ్రీరాముని అరణ్యవాస సమయంలో తెలుగు నేల లోని భద్రాచలం కూడా శ్రీరాముని పవిత్ర పాదస్పర్శ తో పునీతం అయ్యింది.
అటువంటి పుణ్యచరితుని కళ్యాణం శ్రీరామ నవమి నాడు భారతదేశం లోని ప్రతి పల్లె లోనూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ క్రమం లోనే మా పెనుగొండలోనూ వీధి వీధినా శ్రీరామ నవమి సంబరాలు వైభవంగా జరుగుతాయి.
మా పెనుగొండలో జరిగే శ్రీరామ నవమి సంబరాలు
చూడటానికి చుట్టుపక్కల పాతిక గ్రామాల నుండి జనం వస్తారు. అదీ విశేషం . . అదీ మా పెనుగొండ ప్రత్యేకత.
ఉగాది రోజునే శ్రీరామ నవమి పందిళ్ళకోసం మొదటి స్తంభాన్ని పాతుతారు. దీన్నే ‘స్తంభం ముహూర్తం’ అని మా కుర్రకారు అంటారు. నగరేశ్వర స్వామి గుడికి దగ్గరగా ఉన్న బీళ్ళ వారి రామాలయం దగ్గర జరిగే శ్రీరామ నవమి సంబరాలు మా కుర్రకారుకి మాంచి ‘కిక్కిచ్చే’ రోజులు.
అలా అని మీరు మా కుర్రకారుని ‘మరోరకంగా’ జమ కట్టేయకండి.
‘కిక్కు’అంటే మా పేర్రాజు గాడి భాషలో హుషారు అని అర్ధం. మా కుర్ర బ్యాచ్ కి లీడర్ పేర్రాజే. శోభన్ బాబులా మావాడు మంచి అందగాడు. వాడు ర్యాలీ సైకిల్ ఎక్కి వెళ్తుంటే ఆడపిల్లలు కిటికీల్లోంచి తొంగి చూసేవారు. జమీందారు
గారి హై స్కూల్ లో పదవతరగతి చదవుతున్న మావాడు పరుగు పందెం లో ఎప్పుడూ ఫస్టే.
తాడి బాబ్జి గారి మామిడి తోటలో మామిడికాయలు దొంగతనంగా కోసి పారిపోవడంలోనే వాడికి ఈ ‘విద్య’ బాగా పట్టుబడిందని మా బ్యాచ్ అంటే కిట్టని వాళ్ళు అంటారు. అది మేం పట్టించుకోం. ఎందుకంటే ఓడిపోయినాడు అక్కసు
పట్టలేక ఏదో ఒకటి అంటాడని మా ‘ఫిలాసఫీ’.
బీళ్ల అప్పలస్వామి శ్రీరామ నవమికి ఊళ్ళో పెద్దల దగ్గర చందాలు తీసుకునేవాడు. అదిగాక తన వ్యవసాయంలో వచ్చిన ఆదాయంలో కొంత రాములు వారి సేవకి ఖర్చు పెట్టేవాడు. ఐదు రోజులూ మంచి మంచి ‘ప్రోగ్రాములు’ పెట్టేవాడు. నవమినాడు హరికథ, రెండవ రోజు బుర్రకథ, మిగతా మూడురోజులూ నాటకాలు ఉండేవి.
రామాలయం నుండి బెజవాడ సూర్యనారాయణ ఇల్లు దాటే వరకూ పెద్ద పందిరి. పందిరి స్తంభాలకు కొబ్బరాకులు చుట్టేవారు. ఆ పందిరిలో ఆడపిల్లలు ఒప్పుల కుప్ప
ఆడుకునేవారు. ఇంకో పక్క పెద్ద గిరి గీసి మగపిల్లలు ‘బచ్చాలాట’ఆడే వారు. పందిరి మధ్యనుంచే సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు వెళ్తూ ఉండేవి. అయినా వీళ్ళ ఆటలకు ఆటంకం ఉండేదికాదు. ఎందుకంటే వాళ్ళే నెమ్మదిగా వెళ్ళేవారు, పిల్లలు ఆడుకుంటున్నారని..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/UFexntbPYiI