Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: సైనైడ్ ఎపిసోడ్ 6 | Cyanide Episode 6 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సైనైడ్ - ఎపిసోడ్ 6
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' ఆరవ భాగం
గత ఎపిసోడ్ లో
బి - వన్ తన తియ్యని మాటలతో శేఖర్ ని లోబరుచుకుంటుంది.
మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలు తెమ్మని అడుగుతుంది.
తనకు సహకరిస్తే వంద కోట్లు సంపాదించుకోవచ్చని ఆశ పెడుతుంది.
ఇక సైనైడ్ ఆరవ భాగం చదవండి.
శేఖర్ ఎంతో ఆలోచించిన పిమ్మట, 'బి - వన్ చెప్పినది ఏమీ కష్టమైనది కాదు. నేను ఎలాగో అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం, కొత్త డి ఆర్ డి ఓ అప్డేట్స్ కోసం వెళ్తూ వుంటాను. అవి చాలా గోప్యంగా చేయవలసిన ప్రాజెక్టుల గనుక నాకు ఒక్కడికే ఆ పర్మిషన్స్ ఉన్నాయి. అందులోని కొన్ని బి - వన్ అడిగిన వివరాలు నేను తేగలను. అవన్నీ రికార్డ్ చేసి ఒకవేళ నేను బి - వన్ కి ఇస్తే.. దాని వల్ల దేశానికి ఏమైనా ఆపద వాటిల్లుతుందా.. ? అదేమైనా దేశద్రోహమా?..' అన్న విధంగా కూడా ఆలోచించి. తనలో తానే ‘పర్వాలేదులే! నేను బి - వన్ ని వదిలి ఉండలేను. ఆమాత్రం వివరాలు సేకరించి, నా భార్యకు విడాకులు ఇచ్చి, కెనడా వెళ్లి ఆ వివరాలతో బి - వన్ తో కలిసి ఆ ప్రాజెక్టులు చేసి 100 కోట్లు సంపాదించవచ్చు. దానివల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి పరవాలేదు! నా జీవితం ఆనందమయం అవుతుంది..' అనుకుంటూ తనలో తానే సమర్ధించుకుంటూ, తాను బి - వన్ తో కలిసి స్వర్గసుఖాలు అనుభవించవచ్చు! అన్న ఆలోచనలు తప్ప మరి ఏ ఇతర విషయాలు ఆలోచించలేదు శేఖర్.
శేఖర్ అలాగే విశాఖపట్నం లోని నేవల్ బేస్ సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఆ తర్వాత ముఖ్యమైన HPCL refinery లో అనుకోకుండా గ్యాస్ లీకై, స్టోరేజ్ ట్యాంకులు రెండు పేలి పోవడంతో ఆ పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో మొత్తం కంప్యూటర్ సాఫ్ట్వేర్ కాలిపోవడంతో మళ్లీ వాటిని రిస్టోర్ చేయడానికి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి కూడా వెళ్లాలి. అంటూ తన కంపెనీ చెప్పడంతో ఒక నెల రోజుల పాటు ఆ పనుల మీద విశాఖపట్నం వచ్చాడు. అంతకుముందే తన సొంత ఊరైన విశాఖపట్నంలో డెలివరీ కోసంభార్య ను పంపించాడు శేఖర్.
ఎంతో హుషారుగా తన పనులన్నీ చేసుకుంటూ భార్యతో కూడా అన్యోన్యం నటిస్తూ పాపం.. ‘భార్య డెలివరీ అయిపోయిన తర్వాత మెల్లిగా విడాకులకు అప్లై చేసి.. కెనడా వెళ్ళిపోవచ్చు!’ అనుకుంటూ ముందుగా నేవల్ బేస్ లో సాఫ్ట్వేర్ పనులు చేస్తూ తన హార్డ్ డిస్క్ లో ఎవరూ చూడకుండా కొన్ని అంతర్గత విషయాలు దేశ రక్షణ కు సంబంధించినవి కూడా సేకరించి బివాన్ చెప్పిన విధంగా నేవల్ వార్ షిప్స్ డీటెయిల్స్ న్యూక్లియర్ submarines లోని ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి? ఎలా ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం గర్వంగా చెప్పుకునే విధంగా అవి తయారౌతున్నాయో..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/NlVL4CEf0tU