Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: ప్రేమ‘భ్రమ’రం - 9 | Prema Bhramaram - 9 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రేమ ‘భ్రమ’రం - 9
రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం తొమ్మిదవ భాగం
గత ఎపిసోడ్ లో...
తను ఉంటున్న ఇంటి ఓనర్ శివశంకర్ గురించి చెబుతుంది ముక్త.
అతను తమకు చేసిన సహాయం గురించి, అందుకు అతడు విధించిన షరతు గురించి కూడా చెబుతుంది.
తరువాత తన ప్రేమ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది.
ఇక ప్రేమ ‘భ్రమ’రం తొమ్మిదవ భాగం చదవండి ...
‘‘ఎక్కడిదాకా చెప్పానో గుర్తుందా?’’ అడిగింది ముక్త.
‘‘గుర్తుంది. శివశంకర్ తెలివిగా మీకో ఆప్షనిచ్చినట్లు చెప్పారు’’ అన్నాను.
ముక్త నావంక చురుగ్గా చూసింది. ‘‘ఆప్షనిచ్చినట్లు చెప్పాను కానీ, ‘తెలివిగా’ అన్న మాట నేను వాడిన గుర్తు లేదే’’ అంది.
ఆమె అన్న పద్ధతినిబట్టి నేనలాగనడం తనకి నచ్చలేదని గ్రహించాను. కానీ -
‘‘ఇందులో మీరనడానికేముంది? అంతడబ్బు బాకీ తీర్చడానికి మూడంటే మూడేళ్లు గడువిచ్చాడాయన. అది తెలివి కాదా?’’ అన్నాను.
‘‘అంటే మూడేళ్లలో ఆ అప్పు తీరదని మీ అభిప్రాయమా?’’ అందామె.
‘‘ఊఁ’’ అన్నాను నమ్మకంగా.
ఆమె నవ్వి, ‘‘తీరకపోవడం ప్రసక్తే లేదు. నాకొచ్చే జీతంలోంచే ఏడాదికి అరవై డెబ్బై వేలు నిలవెయ్యగలను’’ అంది ముక్త.
ఆమె జీతమెంతో తెలియదు. ఆయనకి ఎంత బాకీ పడిందో తెలియదు. అడిగే ఉద్దేశ్యం కూడా నాకు లేదు.
‘‘ఐనా మూడేళ్లలో ఆయన బాకీ తీర్చెయ్యగలరా?’’ అన్నాను.
‘‘మూడేళ్లెందుకు? ఏడాదిలోగానే ఆయన బాకీ తీర్చేయడానికి - నాకు కవన్, భవన్లు కూడా సాయం చేస్తామంటున్నారు’’ అంది ముక్త.
వాళ్లిద్దరికీ ఒకరికొకరు తెలుసో తెలియదో కానీ - ముక్త కథలో - వాళ్లు కుశలవుల్లా, నకుల సహదేవుల్లా జంటగానే వినిపిస్తున్నారు.
అప్పటికి అర్థమయింది నాకు - కవన్, భవన్ - ముక్త కథలో ఎలా చోటు సంపాదించారో!
శివశంకర్నుంచి తప్పించుకుందుకు ఆమె వాళ్లని ఆకట్టుకుని ఉంచింది...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/Awf-CcSDyL8