Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: ఫస్ట్ డే ఫస్ట్ షో | First Day First Show | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఫస్ట్ డే ఫస్ట్ షో
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
మూర్తి, గోపాల్, కుమార్, రాజు- నలుగురూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. మూర్తి, గోపాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్స్ గా పని చేసి రిటైర్ అయ్యారు. కుమార్, రాజు పెద్ద బ్యాంకులలో పనిచేసి రిటైర్ అయ్యారు. నలుగురూ హైదరాబాద్ లో పక్క పక్క ఇళ్ళు కొనుక్కుని, ఆడుతూ పాడుతూ కాలం గడుపుతున్నారు.
ఈ నలుగురికీ కాలేజీ రోజులలో తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి ఆట కి వెళ్లడం అలవాటు. నలుగురూ అభిమానించేది ఒకే నటుడు అవడం తో, ఏ గొడవా లేదు. ఉద్యోగం లో వున్నప్పుడు తప్పా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అలవాటు మానుకోలేదు ఆ నలుగురు.
గురువారం రానే వచ్చింది, తమ హీరో పిక్చర్ కి అంతకముందే మూర్తి తమ పోలీస్ కానిస్టేబుల్ ని పంపించి ఫస్ట్ డే ఫస్ట్ షో కి అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు మొదటి షో, నలుగురు ఫ్రెండ్స్ బయలుదేరి ఉడిపి హోటల్ లో, వేడి వేడి ఇడ్లీ సాంబార్, తలో సింగల్ పూరి తిని, కాఫీ తాగి, హాలు కి చేరుకున్నారు. అప్పటికే జనం తండోపతండాలు గా వుండి హాలు లోపలికి తోసుకుంటూ వెళ్తున్నారు.
“పద పద, మన హీరో ఎంట్రన్స్ సీన్ మిస్ అవ్వకుడదు” అంటూ తాము చేసిన ఉద్యోగాల విషయం కూడా మర్చిపోయి తోసుకుంటూ లోపలకి వెళ్లారు.
అప్పుడే న్యూస్ రీలు మొదలైంది, హాలంతా చీకటి.
సెల్ లైట్ సహాయం తో తమ సీట్లు దగ్గరికి చేరి, “అమ్మయ్య మొత్తానికి టైంకి చేరుకున్నాం” అన్నాడు మూర్తి.
సినిమా మొదలైన పదినిమిషాలలోనే హీరో పెద్ద ఫైటింగ్, జనం ఈలలతో హాలు రీసౌండ్ యిస్తోంది.
ఇంతలో మూర్తి మొహం మీద టార్చి లైట్ వెలుగు పడింది. చిరాకు గా వాళ్ళని “అడ్డం తప్పుకోండి. మంచి సీన్ జరుగుతున్నప్పుడు అడ్డంగా రావడమే కాకుండా లైట్ వేస్తారేమిటి?” అన్నాడు మూర్తి.
“హలో సార్, ఈ సీట్స్ మావి, మా సీట్స్ లో కూర్చొని మమ్మల్ని దబాయిస్తున్నారు, లేవండి” అన్నాడు ఆ నలుగురు లో ఒకడు చిరాకు గా.
“ భలే వాడివే, ఈ సీట్స్ మావి, కావాలంటే మా టికెట్స్ యివిగో... చూడు” అంటూ టికెట్స్ చూపించాడు మూర్తి.
ఆ వచ్చిన వాళ్లలో ఒకడు, “ఈ టికెట్స్ ఈ రోజు ఫస్ట్ షో కి, యిది మార్నింగ్ షో.. లేవండి” అన్నాడు.
అందులో ఒక రౌడీ కుర్రాడు, “అరే! ఉటో బే.. మా సీట్స్ లో కూర్చొని నకరాలు పోతున్నావు” అన్నాడు.
అంతే! ఏమైందో తెలియదు, మూర్తి కళ్ల ముందు నుంచి గోపాల్ చెయ్యి వెళ్లి వాడి మొహాన్ని తాకడం, వాడు కింద పడటం ఒకే సారి జరిగింది. ఇంతలో హీరోయిన్ చెలరేగిపోతో పాడుతున్న సాంగ్ వస్తోంది. ఏమి జరిగిందో పట్టించుకోకుండా మిగిలిన ముగ్గురు స్క్రీన్ వంక చూస్తో వుంటే, మేము తేలు కుట్టిన దొంగలు లాగా బయటకు నడిచాము...
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/LYoQiIqJAcI