Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: తప్పుకి పరిహారం | Thappuki Pariharam | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
తప్పుకి పరిహారం
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అదొక పేరు ప్రతిష్టలు కలిగిన ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్త! కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికింపచేస్తున్న తరుణంలో ఐ.టి. కంపెనీలతో బాటుగా చాలా కంపెనీలకూ, పరిశ్రమలకూ లాక్ డౌన్ నిర్భందించింది ప్రభుత్వం!
ఉమ ఆ కంపెనీలో ప్రాజక్ట్ డెవలప్మెంట్ విభాగంలో మేనేజర్ గా పనిచేస్తోంది.. దాదాపు పన్నెండుసంవత్సరాల సాఫ్ట్ వేర్ ప్రోగామింగ్ అనుభవంతో ఎంతో చాకచక్యంగా, చురుకుగా పనిచేసే "ఉమ" పట్ల ఆ విభాగం హెడ్ కు మంచి ఒపీనియన్ ఉంది.. అందుకనే ఒక మూడునెలల టైమ్ పరిధిలో పూర్తి చేయాల్సిన ఒక ప్రోజక్ట్ కి సాఫ్ట్ వేర్ డెవలప్ చేసి ఇవ్వవలసినదిగా ఆ ప్రోజక్ట్ హెడ్ "ఉమ"కు ఎసైన్ చేయడం జరిగింది..
ఆ సాఫ్ట్వేర్ విజయవంతం అయితే మరెన్నో ప్రాజక్ట్ ఆర్డర్లు క్లైంట్ కంపెనీ ఇస్తానని ప్రామిస్ చేయడంతో లాక్ డౌన్ ముందురోజే "ఉమ"ను తనఛాంబర్ లోకి పిలిచి ప్రాజక్ట్ వివరాలన్నీ ఆమెతో చర్చించి, ఏ ప్లాట్ ఫాం ఉపయోగించి చేస్తే సొల్యూషన్ ఔట్ పుట్ వస్తుందో బాగా స్టడీ చేయమని, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, మరింత దీక్షగా ప్రాజక్ట్ పూర్తిచేయమని, స్కెచ్ వేసి చూపించాడాయన.. అనుమానాలుంటే క్లైంట్ ను కూడా కోఆర్డినేట్ చేయమని "గుడ్ లక్ అంటూ విష్ చేసి పంపించాడు ఉమను!
లాక్ డౌన్ పిరియడ్ అయినా ఉమ కు దీక్షగా ఇంట్లో కూర్చుని పనిచేయడం కుదరడంలేదు.. తన రెండేళ్ల కొడుకుని అత్తగారు చూసుకుంటున్నా, గది తలుపులు వేసుకుని పనిచేసుకుంటుంటే వచ్చీరాని మాటలతో ' అమ్మా తాపు తీయి ' అంటూ వాడు తలుపులు బయటనుండి దబ దబా బాదుతూ ఉంటాడు.. అలాగే ఉమ అయిదేళ్ల కూతురు ' నిత్య' కు కూడా స్కూల్ లేని మూలాన పిల్లలిద్దరూ ఆడుకుంటూ, కొట్టుకుని ఏడుస్తుంటే అత్తగారు సంభాళించినా వాళ్లను ఆప శక్యం కావడంలేదు..
ఉమ భర్త రఘు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాడు.. వీడియో కాన్ఫరన్సెస్, మీటింగ్స్, ఫోన్స్ కాల్స్ తో అతను తలుపు తెరవడు.. ఇంక ఉమకు డే టైమ్ లో పని సరిగా చేయలేకపోవడంతో, రాత్రి పిల్లలను రఘు దగ్గరే పడుకోబెట్టి, రాత్రి అంతా కూర్చుని పని చేసుకోక తప్పడంలేదు!
అనుకున్నట్లుగా మూడునెలల టైమ్ ఫ్రేమ్ లో ప్రాజక్ట్ పూర్తిచేసింది.. ఎప్పటికప్పుడు ప్రాజక్ట్ స్టేటస్ విషయమై క్లైంట్స్ తో మాట్లాడుతూ ఉండేది.. తన బాస్ కు కూడా అప్ డేట్స్ ఇస్తూ ఉండేది.. ఇంక రెండురోజుల్లో క్లైంట్ కు ప్రాజక్ట్ రిలీజ్ చేయాలి, ప్రోగామింగ్, సాఫ్ట్ వేర్ టెస్టింగ్ అవీ క్షుణంగా పరిశీలించింది.. ఔట్ పుట్ అనుకున్నట్లుగా వస్తోంది.. తను ఉపయోగించిన ' డి కోడింగ్' పరఫెక్ట్ గా పనిచేస్తోంది!
సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది! తను డెవలప్ చేసిన సాఫ్ట్ వేర్ సింగపూర్ లో ఒక రిటైల్ బేంక్ కార్యాలయానికి అవసరమైనది.. సింగపూర్ లో ఆ బేంక్ చాలా ప్రతిష్టాత్మకమైనది.. ఆ బేంక్ తమ కష్టమర్స్ కు విస్తృత మైన సేవలను సకాలంలో అందిస్తూ మొత్తం బేంకింగ్ సెక్టారులో ఒక అత్యుత్తమైన నాణ్యమైన బేంక్ గా పేరు తెచ్చుకుంది..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/xBd8iMw4vW8