Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: ది ట్రాప్ ఎపిసోడ్ 15 | The Trap Episode 15 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ది ట్రాప్ ఎపిసోడ్ 15
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
కామేశ్వర రావు, వసంత గుడిలో కలుస్తారు.
పరమేశ్వర్, వినోదిని గర్భగుడి ముందు మాలలు మార్చుకున్నారు.
మరుసటి రోజు వసంత, వేదమూర్తి ఇంటికి వస్తుంది.
ఇక ది ట్రాప్.. 15 వ భాగం చదవండి…
కొన్ని పరిచయాలు క్రమక్రమంగా కాల పరివాదిని పైన వినవచ్చే శృతిలయల్లా, పొదరిండ్లలోని తీగల్లా, మాధుర్య భావనల్లా పెనవేసుకుపోతాయి. ఆ రీతిన భువనేశ్వర్, వరూధిని అదేదో అయస్కాంతం లాగినట్టు అడపా దడపా కలుసుకుంటున్నారు; కొన్నిసార్లు ప్రభావతికి తెలిసి కార్య కారణంతో--. మరికొన్ని సార్లు తాముగా యేదో ఒక నెపంతో మందాకినిని గార్డెన్ పార్కుకి తీసుకెళ్ళటానికని, ఇంకొన్ని సార్లు స్పెషల్ డిన్నర్ పార్టీలకని— మొత్తానికి, మేటర్ ఆఫ్ వైనం యేమంటే— ఇద్దరూ కలుసుకోవడమనే పరిధి నుండి తప్పించుకోలేక పోతున్నారు.
ఇద్దరి మధ్యా కుదిరిన మధుర మనోహర శారీరక మానసిక కెమిస్ట్రీయే కారణ మేమో—అది వాళ్ళిద్దరికీ తెలియకుండానే పెనవేస్తూ సాగిపోతుందేమో అనివార్యంగా, అవిఛ్ఛన్నంగా-- కాని— భువనేశ్ అంతరంగాన మాత్రం అలా తోచడం లేదు. ఎందుకంటే—అతడు భార్యను సొమ్య శుభ్ర తేజస్సుతో నిండిన మనసుతో ప్రేమించాడు, ఇంకా—ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది అతడి సతీమణి ప్రభావతికి చంద్రుడిలోని చల్లదనంలా ఆకాశంలోని ధవళ కాంతిలా స్పష్టంగా తెలుసు, మగాడు యెక్కడైనా దాపరికం చూపించగలడు. కాని—పడక గదిలో అతడి మనో ప్రస్థాన వైఖరిని దాచుకోలేడు కదా!
అతడు ఆ మనోప్రస్థాన వైఖరిని లోలోన దాచుకోగలిగినా జీవన సహచరి మొగలి పట్టను ఆఘ్రాణిస్తున్నట్టు పసిగట్టేయ గలదు కదా! మరి ఇదంతా ప్రభావతికి తెలియకుండా యెలా సాగుతుంది? ఎంతగా ఆమె వరూధిని కూతురు మందాకిని పట్ల మమకారం పెంచుకున్నా, వరూధిని పట్ల సుహృద్భావం పెంచుకున్నా, తన మగాడు మరొకతెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంటుందా?
నిజంగా ఇదంతా ఆమెకు తెలియదా! తెలియకుండానే సాగుతుందా--ఇదీ మిలియన్ డాలర్స్ ప్రశ్న—ఇందులోని చిక్కుముడి ఎప్పుడు ఎలా వీడుతుందో మరి---
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/kQlRtSz0t1k