Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: సంపత్ సినిమా కథలు - 6 | Sampath Cinema Kathalu - 6 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సంపత్ సినిమా కథలు - 6
రచన : S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
నరసింహకు కనపడకుండా నారాయణను తప్పిస్తాడు కిరణ్.
తను నారాయణ కూతురినని కిరణ్ కి చెబుతుంది మేరీ.
కిరణ్, కావ్యతో కలిసి పార్క్ కి వెళ్తాడు.
ఇక 'సంపత్ సినిమా కథలు’ ఆరవ భాగం చదవండి.
హాస్పిటల్ లో ఒక రోజు నారాయణ - భీమా, రంగల దగ్గరికి వచ్చి "సాయంత్రం గెస్ట్ హౌస్ లో మందుపార్టీ " అన్నాడు.
"ఎందుకు గుర్తులేదు, సోమవారం అన్నావు కదా.. ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటే ఈ రోజు వచ్చింది." అన్నాడు రంగ.
నారాయణ మాట్లాడుతూ "అబ్బా. రంగ గాడిది షార్ప్ బుర్ర." అంటూ "ఈ రోజు పెండ్లి కొడుకులా తయారు అయ్యావు. మెడలో గోల్డ్ చెయిన్, చేతులకు ఉంగరాలు " అన్నాడు.
"అదా.. ఉదయం ఒక ఫంక్షన్ ఉంటే పోయి అలాగే హాస్పిటల్ డ్యూటీకి వచ్చాను " అన్నాడు రంగ.
"ఓహో అలాగా, ఆరే రంగ.. భీమ.. నా దగ్గర డబ్బులు లేవు. ఒక 5వేలు అప్పు వుంటే ఇవ్వండిరా, ఈ రోజు మందు పార్టీకి" అన్నాడు నారాయణ.
"రేపు నాకు ఇస్తానంటే ఇస్తా” అన్నాడు భీమా.
‘నీవిచ్చిన 5 వేలకు ఇంక 5 వందలు కలిపి రేపే పూవుల్లో పెట్టి ఇస్తా. అలా ఇస్తే అభ్యంతరం లేదు కదా " అన్నాడు నారాయణ.
భీమ ఆనందంతో వెంటనే జేబులోంచి 5 వేలు తీసి ఇచ్చాడు.
"అవును నారాయణా.. ఆ రోజు నుంచి పిచ్చి అవతారం కనపడ్డం లేదేమిటి?" అన్నాడు భీమా.
వీళ్ళు ఆ పిచ్చి అవతారం గురించీ అడుగుతారని ముందే తెలుసు కాబట్టి వెనకాల కాంపౌండ్ గేట్ చెట్టు దగ్గర ఉన్న రూంలోకి తెచ్చిపెట్టాడు నారాయణ.
"అరే.. నేను ఇప్పుడే వెనుక ఉన్న మన కాంపౌండ్ గేట్ దగ్గర చూశానే " అంటూ
"ఒరే భీమ.. ఒక్కసారి చూసిరా , నేనేమ్మన్నా వేరే ఎవరినైనా చూసి అవతారం అనుకున్నానేమో" అన్నాడు నారాయణ.
భీమ అక్కడ కెళ్ళి చూసి వచ్చి "అవునురా రంగ.. ఆ పిచ్చి అవతారం అక్కడ ఉన్నాడు. మనం ఇక్కడ చూశాం. అక్కడ చూడలేదు. మకాం ఇక్కడ చెట్టు దగ్గర ఉన్న రూమ్ నుండి అక్కడ చెట్టు దగ్గర ఉన్న రూమ్‌కు షిఫ్ట్ అయ్యినట్టు ఉన్నాడు" అన్నాడు భీమ.
"సర్లే.. ఆ పిచ్చి అవతారం ఎక్కడ వుంటే మనకు ఎందుకు? నాకైతే ఆ నరసింహ పీడ విరగడ అయ్యింది. అంతా మీ వల్లనే " అన్నాడు నారాయణ.
"అవును.. అవును. అందుకే ఈ రోజు మందు పార్టీ" అన్నాడు భీమ.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/rQBv-7iUuq4