Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: Paganu Champina Sahasam | పగను చంపిన సాహసం | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పగను చంపిన సాహసం
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
పెద్దలు ధైర్యే లక్ష్మి సాహసం అన్నారు. సాహసం అనేది కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలను రూపుమాపుతుంది. సాహసం సదా విజయానికి మూలం. పెద్దలు తమ పిల్లలకు పిరికితనాన్నినూరిపోయకుండా ధైర్య సాహసాలను చిన్న వయస్సు నుంచీ నేర్పాలి....
"గుడ్ మార్నింగ్ ప్రాణనాథా"
ఆరు గంటలకు లేచి, స్నానం చేసి, దీపారాధన చేసి, పాలు కాచి, నైవేద్యం పెట్టి, కాఫీ కలిపి ప్లాస్క్ లో పోసి, భర్త శ్రీహరిని లేపేటందుకు పడక గదిలోకి వచ్చింది సుధ. మంచం పై బోర్లా పడుకుని ఉన్నాడు శ్రీహరి. భార్య పలుకులను విన్నాడు. కళ్ళు తెరిచి... తన చేతితో సుధచేతిని పట్టుకొని మంచం మీదికి లాగాడు. సుధ మంచం పై కూర్చుంది. తన చేతులతో సుధ నడుమును చుట్టేశాడు.
"నేను స్నానం చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీరూ లేచి స్నానం చేయండి. తన చేతులతో అతని చేతులను నవ్వుతూ విడదీసింది. మంచం దిగి నిలబడింది సుధ.
"ఆదివారం స్పెషల్ కావాలి సుధా!..." ఓరకంట సుధ ముఖంలోకి చూసాడు శ్రీహరి.
"ఆఁ... అదంతా రాత్రికి ఇప్పుడు కాదు. లేచి త్వరగా స్నానం చేయండి. నన్ను ఈరోజు గండిపేట గోల్కొండకు తీసుకుని వెళతానని మాట ఇచ్చారు. మరిచారా!..." చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ సత్యభామలా చూస్తూ పలికింది సుధ.
"ఓ... ఆ మాటే మరిచాను డియర్!... సారీ... అర్థగంటలో రెడీ అవుతాను. టిఫిన్ దార్లో చేద్దాం." లేచి వేగంగా బాత్రూం వైపుకు వెళ్ళాడు శ్రీహరి.
సుధ హాల్లోకి వచ్చి టీవీని ఆన్ చేసి సోఫాలో కూర్చుంది. శ్రీహరి స్నానం చేసి హాల్లోకి వచ్చాడు. ప్లాస్క్ లోని కాఫీని కప్పులో పోసి శ్రీహరికి అందించింది సుధ.
ఇరువురు చక్కగా తయారై కార్లు కూర్చున్నారు ఇరవై నిమిషాల్లో ఒక హోటల్ ముందు కారును పార్కు చేశాడు శ్రీహరి. ఇరువురూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశారు.
కారు ఎక్కి గోల్కొండకు చేరారు.శ్రీహరి, సుధ అన్నాచెల్లెళ్ల పిల్లలు. వారిరువురి వయస్సులో ఆరేళ్లు తేడా. సుధ మంచి అందగత్తె. ఎం ఏ వరకు చదివింది. శ్రీహరి సబ్ రిజిస్ట్రార్. మూడు నెలల క్రిందట వారి వివాహం జరిగింది. మంచి అన్యోన్యమైన దాంపత్యం.
శ్రీహరి... సుధలు ఆ కోటలో ప్రవేశించారు. అన్ని ప్రాంతాలు తిరిగి చూశారు. సుధ గోల్కొండను చూడడం అదే మొదటిసారి. ఆనందంగా ఫోటోలు తీసుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని సమయాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. అక్కడి నుంచి బయలుదేరి గండిపేట ప్రాంతానికి చేరారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/9Ovnm_LroUM