Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: పులి మీద స్వారీ | Puli Mida Swari | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
పులి మీద స్వారీ
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆ రోజు మాధవ్ ఆఫీసుకొచ్చేసరికి ‘సర్కిల్ ఇనస్పెక్టర్ గౌతమ్ ని ఎవరో దారుణంగా హత్యచేసా’రన్న పిడుగు లాంటి వార్త తెలిసింది. మాధవ్, గౌతమ్ ఇద్దరూ పోలీసు శాఖలో ఒకేసారి ఎస్సైలుగా చేరారు. ఇద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ చదివారు. గౌతమ్‌కు పోలీసు శాఖలో చాలా స్ట్రిక్ట్ పోలీసు ఆఫీసర్ అన్న పేరుంది..
మాధవ్ వెంటనే డీయస్పీ రఘుని కలిశాడు.
"చాలా ఘోరం జరిగిపోయింది మాధవ్.. ఇలా జరుగుతుందని మేమెవ్వరం అనుకోలేదు" అన్నాడు రఘు.
"సార్ ! మీరెవ్వరూ అనుకోలేదు గానీ మా బేచ్లోని వాళ్ళంతా అతని ప్రాణానికి ముప్పు ఉందని అనుకుంటునే ఉన్నాము" అన్నాడు మాధవ్.
"మీ కెందుకొచ్చిందా అనుమానం.. ? అలాంటప్పుడు ఎస్పీ గారికి గాని, నాకు గానీ ఆ విషయం ఎందుకు చెప్పలేదు" అన్నాడు రఘు.
"సార్! మీరు 20 సంవత్సరాల నుంచి పోలీసు శాఖలో పనిచేస్తునారు. ఇక్కడ సమస్యలన్ని మీకు తెలుసు. మొన్నటి దాకా గౌతమ్ ఎన్నో సెన్సిటివ్ పోస్ట్‌లలో పనిచేసాడు. కొన్నాళ్ళు ఏంటీ నక్సల్ స్వాడ్‌లో, కొన్నాళ్ళు సీఐడీలో, మరి కొన్నాళ్ళు టౌన్ సీఐగా, కొన్నాళ్ళు లా అండ్ ఆర్డర్లో పనిచేసాడు. అతని ముక్కు సూటితనం, ఎవరికీ తలవంచని మనస్తత్వాలవల్ల ఎందరికో శత్రువయ్యాడు; ఏసీబీలో ఉన్నప్పుడు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోయాడు.
టౌన్ సీఐగా ఉన్నప్పుడు రౌడీలు, ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలను అణిచివేసి కటకటాల్లోకి నెట్టాడు. అంతర్రాష్ట దొంగల భరతం పట్టాడు. కాలేజీ అమ్మాయిలను ఏడిపించే వాళ్ళను నగర బహిష్కరణ చేయించాడు. స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచివేసాడు. ఈ చర్యల వల్ల ఎందరో శత్రువులను మూటకట్టుకున్నాడు. అటువంటి వాడిని ప్రభుత్వం ఒక్కసారిగా ఆఫీసులో వేసి అతని అధికారమనే కోరల్ని పీకేసింది.. దాంతో శత్రువులు కక్ష గట్టి అతన్ని హత్య చేశారు;" అన్నాడు మాధవ్.
"నువ్వు చెబుతున్నది ఆశ్చర్యంగా ఉంది. అతన్ని ఆఫీసులో వెయ్యడానికీ, హత్యకూ సంబంధం ఏంటి? నువ్వు బోడిగుండుకీ, మోకాలికీ ముడిపెడుతున్నావు" అన్నాడు రఘు.
"సార్! నేను సరిగ్గానే చెప్పాను. మీకు అర్ధం కాలేదో లేక అర్థంకానట్లు నటిస్తున్నారో తెలియటం లేదు.. అతను 10 సంవత్సరాలుగా ఎందరో సంఘ విద్రోక శక్తులు, రౌడీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొని వాళ్ళకి కొరకరాని కొయ్యిగా తయారయ్యాడు;ఇన్నాళ్లూ ఫీల్డ్ పోస్ట్‌లో వున్న రక్షణ వల్ల వాడిని ఎవ్వరూ ముట్టుకునే సాహసం చెయ్యలేదు..
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/VdfpVCcGBjY