Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: ప్రేమ చేజారితే 12 | Prema Chejarithe 12 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
Description:
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 12
రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)
కుమార్ వచ్చి ఎంతో భావోద్వేగంతో ఇలా మాట్లాడసాగాడు.
"అందరికీ నమస్కారాలు...
ఈ ప్రాజెక్టును మేము పదిమంది స్నేహితులము కలిసి చేసాము, ఇంకా కొనసాగుతూనే వుంది. మేము మొదట ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలనుకుంది మా వ్యక్తిగత ప్రయోజనం కొరకే అయినా, దాని వల్ల సమాజానికి ఏదైనా ప్రయోజనం వుంటేనే చేయాలనుకున్నది మాత్రం నిజం.
నాకు దీని వల్ల మా నాన్నగారి లాంటి ముసలి వారు ఎంతగానో ఆనందంగా జీవించగలరనిపించింది. అలాగే కొందరి జీవితాలకు ఓ ఆలంబన ఏర్పడుతుందనిపించింది. అంతే కాక దీని ద్వారా అనాథలెందరికో తల్లిదండ్రుల్లాగా మంచి, చెడులను నిస్వార్థంగా నేర్పించి సంస్కారవంతులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దే రోబోలను సృష్టించవచ్చనిపించింది.
అదీకాక ఈ ప్రాజెక్టు కోసం పెడ్తున్న ఖర్చు మొత్తం మా స్నేహితులమంతా కలిసి సంపాదించినదే. కాబట్టి మేము దీని వల్ల ఏదైనా సమాజానికి చెడు జరుగుతుందనిపిస్తే వెంటనే ఏమాత్రం డబ్బు గురించి ఆలోచించకుండా దీన్ని నాశనం చేయాలనుకునే మొదలెట్టాము.
ఈ ప్రాజెక్టు వల్ల నా స్నేహితులందరికీ కూడా కుటుంబాలు ఏర్పడి ఎంతో ఆనందాన్ని సొంతం చేస్కున్నారనే చెప్పాలి. పిల్లలకు తల్లులుగా వుండే రోబోల చేత అన్ని రకాల పనులు చేయించేది వారి తండ్రులే కాబట్టి, అన్నీ వారి ఇష్టానుసారంగా జరుగుతున్నాయి.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video linkhttps://youtu.be/axbUULXVJU4