Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: నాకేమవుతోంది ఎపిసోడ్ 19 | Nakemavuthondi Episode 19 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
Description:
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
నాకేమవుతోంది..? ఎపిసోడ్ 19
రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
గదిలోకి వెళ్లాక ప్రియను ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు హిప్నాటిస్ట్ భూషణ్. ఆమెకు ఎదురుగా తను కూడా ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఒక స్టూల్ ఉంచాడు. తనతో తెచ్చుకున్న మ్యూజిక్ ప్లేయర్ని ఆ స్టూల్ పై ఉంచాడు. వెలుతురు అడ్జస్ట్ చేయడానికి వీలున్న ఒక బల్బ్ ని కూడా ఆ టేబుల్ పై ఉంచాడు. ఆ బల్బ్ ని తన దగ్గర ఉన్న రిమోట్ తో ఆన్ చేసి గదిలో ఉన్న ట్యూబ్ లైట్ ని ఆపివేశాడు. స్టూల్ కి ఇటువైపు మరో కుర్చీలో తను కూర్చున్నాడు. డాక్టర్ శ్రీనివాస్ ని, సైకియాట్రిస్ట్ త్రిపాఠిని పక్కనే ఉన్న బెడ్ మీద కూర్చోమన్నాడు. తరువాత ప్రియతో మాట్లాడడం ప్రారంభించాడు భూషణ్."చూడు ప్రియా! హిప్నాటిజం అనగానే నీకేదో మత్తుమందు ఇచ్చినట్లు అయిపోతుందని అనుకోవద్దు. కేవలం నీ మనసులో ఉన్న విషయాలు నిర్భయంగా చెబుతావు. అంతే! చిన్నప్పుడు స్కూల్లో నీ స్నేహితురాలు నీతో గొడవ పడి నిన్ను కొట్టిందనుకో.. లేదా నువ్వే ఆ అమ్మాయిని కొట్టావు అనుకో.. ఇంటికి వచ్చాక ఆ విషయం ఎవరితోనూ చెప్పవు. కానీ నువ్వు అదోలా ఉండడం గమనించి మీ అమ్మ ఎందుకలా ఉన్నావని నిన్ను అడుగుతుంది. మొదట ఏమీ లేదని చెబుతావు. ఆ తర్వాత అమ్మ నీకు ఇష్టమైన స్వీట్ లేదా చాక్లెట్ నీకు ఇచ్చి, నీ తల నిమురుతూ, 'ఏమైంది తల్లీ..' అని అడిగిందనుకో.. అప్పుడు అంతవరకు నువ్వు దాచుకున్న విషయం నువ్వు మీ అమ్మతో చెప్పేస్తావు. ఇది కూడా ఒక రకమైన హిప్నాటిజం. ఇందుకు నీకు కావాల్సింది హిప్నాటిజం చేసే వ్యక్తి మీద నమ్మకం. మరెవరికీ చెప్పని విషయం మీ అమ్మకు ఎందుకు చెప్పి ఉంటావు? వేరే వాళ్లకు చెబితే వాళ్లు నిన్ను తప్పు పట్టడమో, ఎగతాళి చేయడమో చేస్తారు అనే ఉద్దేశంతో నువ్వు ఎవరికీ చెప్పి ఉండవు. కానీ మీ అమ్మకు చెప్పడం వల్ల నీకు ఓదార్పు లభిస్తుంది అనే ఉద్దేశంతో చెప్పి ఉంటావు. నిజమేనా?" అడిగాడు భూషణ్."అవునన్నట్లు తలాడించింది ప్రియ. "మీ అమ్మ ఎలాగైతే నీ మంచి కోరుతుందో నేను కూడా అలాగే నువ్వు బాగుండాలని కోరుకుంటాను. నేనే కాదు, డాక్టర్ శ్రీనివాస్ గారు, త్రిపాఠి గారు, బయట ఉన్న డాక్టర్ శ్రీదేవి గారు, ఉదయ్ ప్రవల్లికలు.. అందరం నీ మంచి కోరుకునే వాళ్ళం. కాబట్టి మాతో ఏ విషయమైనా నిర్భయంగా చెప్పు. మెదడులో కొన్ని విషయాలు మరుగున పడిపోయి ఉంటాయి. నువ్వు ఫ్రీగా మాట్లాడడం మొదలుపెడితే దాగి ఉన్న సంఘటనల తాలూకు జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తాయి" అన్నాడు భూషణ్."తప్పకుండా భూషణ్ గారూ! నాకు కూడా నాకిలా ఎందుకు అవుతుందో తెలుసుకోవాలని ఉంది. మీకు పూర్తిగా సహకరిస్తాను" అంది ప్రియ. "దట్స్ గుడ్! చూడు ప్రియా.. ఇప్పుడు నిన్ను ట్రాన్స్ లోకి తీసుకొని వెళతాను. నీకు ఏదైనా చెప్పాలంటే సహజంగా ఉండే సంకోచం లేదా బిడియం ఇప్పుడు ఉండదు. ఎవరికీ చెప్పని విషయాలైనా నాతో ధైర్యంగా చెబుతావు. అలా నాకు చెప్పడం వల్ల నీకు మంచే జరుగుతుందని నీకు బాగా తెలుసు. అందుకే అమ్మానాన్నలతో మాట్లాడినంత చనువుగా నాతో మాట్లాడుతావు. కొన్ని విషయాలు పేరెంట్స్ తో చెప్పకపోయినా స్నేహితురాలికి చెబుతావు. అటువంటి విషయాలు చెప్పేటప్పుడు నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ గా అనుకో.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video linkhttps://youtu.be/8kDBsZ5V5sA