Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: అశ్వ మేధం - ఎపిసోడ్ - 2 | Aswamedham - Episode - 2 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
Description:
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
అశ్వ మేధం ఎపిసోడ్ 2
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"మాది ఇక్కడికి దగ్గర్లోని ఏజెన్సీలో టేకుపల్లె. నాభర్త చైతన్య ఫ్రీలాన్స్ జర్నలిస్టు.. ఈఏజెన్సీలో వార్తలను కవర్ చేస్తుంటాడు. ఆరునెలల క్రితం దయానిధి అనే ఒక కలప కాంట్రాక్టర్ టేకు చెట్లను కొట్టి అక్రమంగా తరలించుకు పోతుంటే గిరిజనులు అడ్డుకొని లారీలను ఆపేయడంతో దయానిధి మనుషులు గిరిజనులపై దాడిచేసి ఆ గ్రామాల మీద పడి వాళ్ళని కొట్టి లారీలను తీసుకెళ్లిపోయారు.
అదే తండాకు చెందిన సుశీల అనే మహిళను దయానందం మనుషులు మానభంగం చేసి హత్య చేశారు; ఆ దాడిలో సుక్కు అనే గిరిజనుడు చనిపోయాడు. నాభర్త ఆ దృశ్యాలను వీడియో తీసి ఎస్పీకి పంపించడంతో ఎస్పీ గారు ఎంక్వయిరీకి ఆదేశించారు.
ఆతరువాత ఆ సుక్కు శవాన్ని తీసుకొని ఆ తండా గిరిజనులు పోలీసు స్టేషన్ మీద దాడి చేసి ఇద్దరు పోలీసులను చంపివేయడంతో అడవి అంటుకుంది. ఏజెన్సీ అంతా ఏకమై పోలీసుస్టేషన్ మీద దాడి చెయ్యడంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
ఆతరువాత పోలీసులు నాభర్త మీద కక్ష కట్టి లేనిపోని కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. అప్పట్నుంచీ అతని ఆచూకి తెలియటం లేదు. ఎక్కడ దాచారో, ఏయో హింసలు పెడుతున్నారో ఎవ్వరికీ తెలియదు; కాబట్టి మీరు ఈకేసుని వాదించి నాభర్త చైతన్య ఆచూకి కనుక్కోమని చెప్పటానికి వచ్చాను” అంది రెండు చేతులు జోడించి.
చరణ్ ఆమెదగ్గర్నుంచి వివరాలు తీసుకొని మొత్తం కేసు వివరాలు చదివాడు.
"మేడం! మీరు ఈకాగితాల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపొండి. మిగతావి నేను చూసుకుంటాను" అని చెప్పి ఆమెను పంపించి వేసాడు.
ఆమర్నాడు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసాడు. పోలీసులు చైతన్య అనే జర్నలిస్టుని అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడో దాచివేసారనీ ,అతని ఆచూకీ తెలియదనీ, పదిరోజులైనా కోర్టు లో ప్రవేశ పెట్టలేదనీ, అతని భార్య శాంతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదనీ, కాబట్టి పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేటట్లు పోలీసులకు ఉత్తర్వులివ్వాలనీ అందులో కోర్టుని అభ్యర్ధించాడు.
ఈవిషయం తెలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరభద్రం చరణ్ ని పిలిచి కేసుని వాపసు తీసుకోమని చెప్పాడు. కానీ చరణ్ అతనికి కొన్ని సాక్ష్యాలుచూపించి, పోలీసుల దమనకాండని వివరించాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video linkhttps://youtu.be/D4yszHyRe4A