Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: మా ఇల్లే ఒక బృందావనం | Maa Ille Oka Brundavanam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
మా ఇల్లే ఒక బృందావనం
రచన: వారణాసి భానుమూర్తి రావు
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఉద్యోగాల వేటలో హైదరాబాదు కు వచ్చిన నేను ఒక బాంకులో మంచి వుద్యోగాన్ని సంపాయించడం, ఆ తరువాత నా ఇద్దరు తమ్ముళ్ళను హైదరాబాదుకు పిలిపించి కాలేజీలల్లో చేర్పించడం, చక చక మని జరిగి పొయ్యాయి. కాలేజీ తరువాత మొదటి తమ్ముడు ఏదో ప్రైవేటు కంపెనీలో మెటీరియల్స్ మేనేజర్ గా చేరాడు. మంచి జీతం, హోదా ఉన్నాయి. ఇక రెండవ తమ్ముడు ఇంకా సీ. ఏ. చదువుతున్నాడు. ఒక రోజు నేను పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. మా తాత గారికి చాలా సీరియస్ గా ఉందని, వెంటనే బయలుదేర మని.. తాతగారికి మా అమ్మ గారు ఒక్కతే సంతానం. నేనూ, నా చిన్న తమ్ముడు హడావుడిగా ఆర్ టీ సీ ఎక్స్ప్రెస్ బస్సులో బయలు దేరాము. ఇంకొక తమ్ముడు పనుల ఒత్తిడి వలన రాలేక పొయ్యాడు. డ్రైవర్ ని అభ్యర్థించిన పిమ్మట మా వూరి క్రాస్ రోడ్ లో నిలిపాడు. ఎక్స్ ప్రెస్స్ బస్సు గాబట్టి మా వూర్లో బస్సు నిలబడదు. హైదరాబాదు నుండి తిరుపతికి వెళ్ళే బస్సులు కడప, రాయచోటి, పీలేరు మీదుగా తిరుపతికి చేరుతాయి. ఆ వూర్లల్లో మాత్రమే బస్సులు నిలుపు తారు. కానీ ఎక్కడంటే అక్కడ నిలబడవు. ఆఘ మేఘాల మీద బయలు దేరాము మేము. బస్సు దిగుతూనే మా తాతగారిని చూడాలని మనసు తహ తహ లాడింది. నేను పెద్ద మనమడిని గాబట్టి మా తాత గారికి నేనంటే చాలా ఇష్టం. మేము ఇంటికి చేరేసరికి హాల్లో తాతగారు నులక మంచం మీద పరచిన ఒక పాత దూది పరుపు మీద పడుకొన్నాడు. ఆ పరుపును మా తాత గారు ఎన్నో ఏళ్ళ నుండి వాడుచున్నాడు. ఆ పరుపు మీదనే నేను చిన్నప్పుడు తాత గారితో పడుకొని బోలెడు కథలు చెప్పించు కొనే వాడ్ని. అలాగే తాత గారు తత్వాలు బాగా పాడే వారు. మా తాత గారి పరుపు నుండి ఒక రకమైన వాసన వచ్చేది. అది మా తమ్ముళ్ళకు నచ్చేది గాదు. కానీ నాకు తాత గారంటే అమిత మైన ప్రేమ గాబట్టి, ఆ పరుపు వాసన వల్ల నా కేమీ ఇబ్బంది కలిగేది కాదు. మహా భారతం, రామాయణం కథ లన్నీ ఆ పరుపు మీద పడుకొనే తాతగారు చెబుతుంటే శ్రద్ధగా వినేవాడిని. ఆయన పెద్దగా చదువు కోక పోయినా మన పురాణాల్లో ఉన్న ధర్మ సూక్ష్మాలను విపులంగా చెప్పేవాడు. వేసవి కాలంలో మేమందరం వరండాలో పడుకొనే వాళ్ళం. మా చిన్నతనం లో మా వూర్లో అప్పటికి ఇంకా కరెంటు రాలేదు. ఇప్పటి లాగా ఫాన్లు గూడా వుండేవి కావు. కాబట్టి వెదురు విసన కర్రలు వాడే వాళ్ళం. దోమలు ఎక్కువయితే దోమ తెరలు వాడే వాళ్ళం. మంచి కుండలో నీళ్ళు పోసి రాత్రి పూట దప్పికయినప్పుడు ఆ చల్లటి నీరు త్రాగే వాళ్ళం. మా వూర్లో త్రాగు నీటికి గూడా కరువే! వూరి కంతటికీ ఒకే ఒక దిగుడు బావి వుండేది. దానిలో ఎక్కడో లోతున మెల్లగా దిగాలి. అక్కడ సన్నటి ధారగా వూట వూరి నీరు వచ్చేది. వంతుల వారీ ఒక్కొక్క బిందె పట్టుకొనే వారు మా వూర్లోని ఆడ వారు. ఒక్క బిందె నీటికి ఎన్ని కష్టాలు పడే వారో ఆ దేవుడికే తెలియాలి. ఒక తెల్లని గుడ్డ బిందె మూతికి కట్టి నీటిని పట్టే వారు. పురుగులు, మట్టి లాంటివి ఏమైనా వుంటే వడగట్ట దానికి ఆ తెల్లని బట్టను వాడే వారు.. ఆ కాలంలో బ్రతక డానికి ఎన్ని కష్టాలు పడినారో ఆ భగవంతుడికే తెలియాలి. ప్రభుత్వం వారు ఒక బావిని తవ్వించారు. ఆ బావి లోతు ఆరేడు వందల అడుగులు వుండేది. అంత లోతు తవ్వినా అక్కడ ఉప్పు నీళ్ళు పడినాయి. ఆ నీటిని చేదాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. అయినా మా అమ్మ గారికి మేము పిల్లలంతా సాయం చేసే వాళ్ళం. నీటిని చేంతాడుతో చేది, అండాలల్లో, గంగాళాల్లో నింపడం మా పని. అమ్మ ఆ నీరు బిందెల్లో తీసుకొని మా బచ్చట్లో ఉన్న నీటి తొట్టిని ఇ నింపేది. ఆ నీరు మేము స్నానాలకు వాడే వాళ్ళం. ఎండా కాలంలో నీటి కొరత చాలా వుండేది రాయల సీమ పల్లెల్లో. రాత్రి పూట మరీ ఎక్కువ ఉక్క బోస్తే తాత గారు ఇంటి ముందర పడుకొనే వారు. చల్లని గాలి, ఆకాశంలో మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాలను చూస్తూ నేనూ, మా తాతగారు ఆ మంచం మీద పడుకొని కథలు చెప్పుకొంటూ నిద్ర పొయ్యే వాళ్ళం. కొత్త పరుపు కొనమని ఎన్ని సార్లు చెప్పినా కొనే వాడు గాదు మా తాత. సూది, దారం తీసుకొని ఎక్కడన్నా చినుగులు పడితే కుట్టుకొనే వాడు. అప్పుడప్పుడు మాత్రం దూదేకుల సాయబూలు వస్తే పత్తిని ఏకించి, ఆ పత్తిని పరుపులో దురిగి మళ్ళీ అదే పరుపును వాడుకొనే వారు మా తాతగారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక