Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: మధుర స్మృతి | Madhura Smruthi | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'Madhura Smruthi - New Telugu Story Written By Neeraja Hari Prabhala
'మధుర స్మృతి' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
వేకువనే తన గది కిటికీలోంచి వీచిన చల్లటి గాలులకు మెలుకువచ్చిన శారద కనులు తెరచి దుప్పటి తొలగించి ఆ దిశగా చూసింది. తను ఇష్టంగా పెంచుతున్న రకరకాల పువ్వులు, ఫలముల తోట రమణీయంగా కనిపిస్తోంది. నిత్యం నిద్ర లేవగానే ఆ తోటలో విహరిస్తూ ఆ రమణీయ ప్రకృతిని ఆస్వాదించడం ఆమెకు అలవాటు. కాసేపటికి కాలకృత్యాలను ముగించుకుని శిల్కు శాలువాని భుజాన కప్పుకుని వేడివేడిగా ఫిల్టరు కాఫీని తయారుచేసుకుని కప్పుతో తన ఇంటి ముంగిటి తోటలో ఒక బెంచి మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంది.
చేతిలో పొగలు కక్కుతున్న కమ్మనికాఫీని ఆస్వాదిస్తూ తోటలోని సుందర దృశ్యాన్ని చూడటం ఆవిడకు చాలా ఇష్టం. సమీపంలోని మామిడి కొమ్మ మీద కోయిల తన కమ్మని కంఠంతో "కుహు కుహు" సరాగాలను పలుకుతుండగా మధ్య మధ్యలో తను కూడా శృతి కలిపితే అది తనను వెక్కిరిస్తున్నట్లుగా భావించి మరింత రెచ్చిపోతోంది. అలా కాసేపు కోయిలతో జతకలిపాక "నీకు నీవే సాటి కోయిలమ్మా" అని మిన్నకుండి దాని రాగాలను వింటోంది శారద.
ఈరోజు తన పుట్టినరోజు. తన భర్త ఆనంద్ బ్రతికిఉంటే ఈరోజును ఎంత ఘనంగా, వేడుకగా చేసేవాడో అనుకుంటూ గతించిన భర్తను తలచుకుంటూ లేచి తన గదిలోకి వెళ్లి ఆయన వ్రాసిన డైరీని తీసుకొచ్చుకుని, కళ్లజోడుని సవరించుకుంటూ అందులోని పేజీలను తిరగేస్తోంది. ప్రతి పేజి లోను తన మీద ప్రేమను వ్యక్తపరుస్తూ భర్త వ్రాసిన దానిని చదువుతూ గతం తాలూకు మధుర స్మృతులలోకి వెళ్లింది శారద మనసు.
తను కాలేజీలో చదువుతున్నప్పుడు పరిచయమైన ఆనంద్ తో స్నేహం క్రమంగా వాళ్లిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. డిగ్రీ పూర్తవగానే ఆనంద్ కు మంచి ఉద్యోగం రావడంతో తమ ప్రేమ విషయాన్ని ఇరువైపులా పెద్దలకు చెప్పటం జరిగింది. ఆనంద్ తల్లితండ్రులు తమ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ తన తల్లితండ్రులు అభ్యంతరం చెప్పటంతో కొంత మనస్ధాపానికి గురయింది తను. తండ్రి పట్టుదలతో ఎన్ని సంబంధాలను తీసుకొచ్చినా తను ససేమిరా కాదనడంతో తన మొండిపట్టుదలను అర్థం చేసుకుని ఆనంద్ తో వివాహం జరిపించారు శారద తల్లితండ్రులు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/LdpKSvtPbsM