Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ - 3 | srivari Kattu Kathalu Episode - 3 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
Description: శ్రీ వారి కట్టు కథలు ఎపిసోడ్ 3
రచన : మల్లవరపు సీతారాం కుమార్
ఈ వెబ్ సిరీస్ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడుతోంది.
గత ఎపిసోడ్ లో
గౌతం తనతో లీవ్ శాంక్షన్ కాలేదని చెప్పి, ఆఫీసుకు వెళ్తున్నట్టుగా నటించి, ఎక్కడికో వెళ్లడం సమీరను చాలా బాధించింది. అదే సమయంలో పక్క పోర్షన్ జయా ఆంటీ సమీరను ట్రాప్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇక చదవండి...
"నా మీద కోపం తగ్గినట్లుగా ఉందే!" అంటూ లోపలికి వచ్చి సోఫా లో కూర్చుంది జయా ఆంటీ. ఏం మాట్లాడకుండా ఆమె పక్కనే కూర్చుంది సమీర.
అంతలోనే చటుక్కున పైకి లేచి "సారీ ఆంటీ! మీకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా కూర్చుంటున్నాను. టీ పెట్టుకుని వస్తాను" అంటూ లోపలికి వెళ్లబోయింది.
జయా ఆంటీ ఠక్కున పైకి లేచి సమీర భుజం మీద చేయి వేసి "మనలో మనకు మర్యాదలు ఎందుకే? కూర్చో " అంటూ సోఫా లో తన పక్కనే కూర్చో పెట్టుకుంది.
తన భుజం మీది నుంచి ఆమె చెయ్యి తీయకపోవడంతో సమీర తన భుజం ఒకసారి కదిలించి ఆమె చేతిని నెమ్మదిగా తొలగించింది.
"అదేంటి పిల్లా? ఏ ఎదురింటి కుర్రాడో చెయ్యి వేసినట్లు అలా ఉలిక్కి పడ్డావు?" అంటూ సమీరను దగ్గరకు లాక్కొని బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టింది...