Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: కూతురు దిద్దిన కాపురం | Kuthuru Diddina Kapuram | Telugu Short Story| Venku Sanathani | manatelugukathalu.com
Description: కూతురు దిద్దిన కాపురం
రచన: వెంకు సనాతని
తండ్రి ఇల్లు అమ్మబోతున్నాడన్న వార్త తెలిసిన వెంటనే భర్తకు ఓ మాట చెప్పి, వెంటనే బస్సు టికెట్ బుక్ చేయించి మరీ హుటాహుటిన ఊరికి బయలుదేరింది శ్యామల.
"నాన్నా.. నేను విన్నది నిజమేనా..!!" గుమ్మంలోకి అడుగు పెడుతూనే అంటుంది శ్యామల.
"అమ్మా..! శ్యామలా..!!" ఇదేనా రావటం. అక్కడ అంతా బాగానే ఉంది కదా అన్నాడు శేషయ్య, కూతురి ఆకస్మిక ఆగమనంతో..
నాన్నా అవన్నీ తర్వాత “ఇల్లు అమ్మకానికి పెట్టారట నిజమేనా..!!” గొంతు కాస్త పెద్దది చేసి అడుగుతుంది శ్యామల. "అమ్మా.. ఇప్పుడేగా వచ్చావు. కొంచెం నెమ్మదించు." అంటూ పక్కనే బల్ల మీద ఉన్న నీళ్ళ గ్లాసు చేతికి అందించాడు. ఆబగా మంచినీళ్ళు అందుకుని తాగడంతో కొంత ఉపశమనం కలుగుతుంది శ్యామలకి.
ఉరుకుల పరుగులతో హడావుడిగా, హఠాత్తుగా రావడానికి గల కారణం. మళ్ళీ ఇల్లు అమ్ముతున్నారని విన్నాను. “ఎందుకు నాన్నా? ఇప్పుడేం అంత కష్టం వచ్చింది? ఉన్న ఈ గూడు కూడా లేకపోతే ఎలా?” చెప్పుకుంటూ పోతుంది శ్యామల. ఆ ప్రశ్నల పరంపరకు జవాబు చెప్పలేక మాటలకందని బాధను లోపలకు దిగమింగుకుంటూ మౌనంగానే ఉండిపోయాడు శేషయ్య.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Ia2wiu3hM6E