Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: ఆత్మ విశ్వాసము | Athma Viswasamu | Telugu Short Story | Dr Shahanaj Bathul | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
ఆత్మ విశ్వాసము
షహనాజ్ బతుల్
"కాంతి నిన్ను సులోచన మేడం రమ్మన్నారు". అన్నది పూజిత వచ్చి.
"ఎందుకు?" అడిగింది, కాంతి.
"ఏమో తెలియదు." అని చెప్పి, వెళ్ళిపోయింది.
కాంతి హాస్టల్ ఆఫీస్ కి వెళ్ళింది.
"కూర్చో కాంతి" అన్నారు సులోచన మేడం.
"ఫర్వాలేదు మేడం. నన్ను పిలిచారట,"
అడిగింది
"నీ కూతుర్ని తెచ్చుకున్నావట. ఇది వర్కింగ్ విమెన్స్ హాస్టల్. దీనిలో కి చిన్న పిల్లల్ని తెచ్చుకో కూడదు. మీ అమ్మాయిని పంపించినా సరే. లేక నువ్వు పాపతో వెళ్ళిపోయినా సరే."
కాంతి కి గొంతుక లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. అబద్ధం చెప్పలేదు.
"అలాగే మేడం రేపు గానీ, ఎల్లుండి గానీ వెళ్ళిపోతాను. ఉన్నఫళంగా వెళ్ళటం కష్టం", అన్నది.
"సరే రేపు నేను నువ్వు ఎంత కట్టాలో కలిక్యులెట్ చేసి, చెప్తాను. కట్టేసి, వెళ్ళు."
"మేడం నాకు జీతం మొదటి తారీకున అందుతుంది. ఇప్పుడు నా దగ్గర లేవు మేడం."
"హాస్టల్లో ఎవరిదగ్గరైనా అప్పు తీసుకొని ఇవ్వు మొదటి తారీకున వాళ్ళ అకౌంట్ లో వేసేయ్యి."
"వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా మేడం. సరే నేను ప్రయత్నం చేస్తాను."
అని చెప్పి, రూం కి తిరిగి వచ్చింది....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Bd_OjZzPqs8