Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: Love Challenge Episode 27 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
జనాలు అందరూ చేరి చలపతిని చితకబాది, బయటకు నెట్టి వేశారు. నిత్యా మేడం ఎవరూ లేని సమయం చూసి గురుమూర్తి కి కాల్ చేసి విషయం చెబుతుంది. అతను నిత్యా మేడంతో, స్టూడెంట్స్ కి ఒకరోజు రెస్ట్ ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ల మన్నాడు. అక్కడ తన ప్లాన్ అమలు చేస్తానని చెప్పాడు. చందూ, చలపతి వెంట ఒక గుడిసె దగ్గరకు వెళతాడు. అక్కడ ఒక అందమైన యువతి ని చూస్తాడు.
ఇక చదవండి…
చలపతి ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి చందూకి. ఏం చేయాలో అర్థం కాలేదతనికి.
చలపతి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ చందూ వైపు వస్తున్నాడు.
ఆ యువతి వైపు చూశాడు చందూ.
ఆమె చలపతితో "ఏమిటి మామా! దెబ్బలు బాగా తగిలాయా.. ఈ కుర్రాడితో మసాజ్ చేయించుకోవాలని వస్తున్నావ్? కోడె గిత్త కదా.. మంచి పట్లే పడతాడులే" అంది ఒళ్ళు విరుచుకుంటూ.
చలపతి, చందూ వంక చూస్తూ "ఇదేం నా పెళ్ళాం కాదులే. భయపడకు. అయినా మీ కాలేజీ అమ్మాయిలు ఒప్పుకోలేదా.. దీని వంక చూస్తున్నావ్?" అన్నాడు నవ్వుతూ.
కాస్త ధైర్యం వచ్చింది చందూకి.
"ఒక అమ్మాయి అంటే మోజు వుంది. కానీ ధైర్యం చాలటం లేదు. నువ్వు సహాయం చేస్తావా?' సందేహిస్తూనే అడిగాడు.
"మత్తు మందిచ్చి మోజు తీర్చుకోవడమే. నేను సహాయం చేస్తాను కానీ ఖర్చవుతుంది' అన్నాడు చలపతి.
"నేను ఇవ్వలేను గానీ గురుమూర్తి దగ్గర ఇప్పిస్తాను. అన్నట్టు ఆయన నీకు ఎంత ఇస్తానని చెప్పాడు? ప్రశ్నించాడు చందూ.
"ప్రస్తుతానికైతే ఐదు లక్షలు ఇస్తానన్నాడు. ఎలక్షన్ పూర్తయి, ఆయన కొడుకు గెలిస్తే మరో ఐదు లక్షలు ఇస్తారట" చెప్పాడు చలపతి.
వెంటనే గురుమూర్తి కి కాల్ చేశాడు చందూ.
"పెద్ద మొత్తం తీసుకున్నారు కాబట్టే పూర్నేష్, విక్కీ మీ పేరు బయట పెట్టలేదు. చలపతిని గట్టిగా నాలుగు తగిలిస్తే మీ పేరు చెప్పేస్తాడు. అతను నోరు తెరవనంత అమౌంట్ యిస్తే మంచిది" చెప్పాడు చందూ.
"ఎంత ఇమ్మంటావ్?" అడిగాడు గురుమూర్తి.
"కనీసం పాతిక లక్షలు ఇస్తే మన పేరు బయటకు రాకుండా పని అవుతుంది" సందేహిస్తూనే అడిగాడు చందూ.
వెంటనే "సరే. కానీ మన పేర్లు బయటకు రాకూడదు. నిత్యా మేడం ఏదైనా ప్లేస్ కి స్టూడెంట్స్ అందరితో ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తారు. అక్కడ రిత్విక్ చూస్తూ ఉండగా ఏదైనా అల్లరి చేయమని చలపతికి చెప్పు" " అన్నాడు గురుమూర్తి.
"అలాగే సర్! అన్నీ నేను చూసుకుంటాను" అన్నాడు చందూ.
కాల్ కట్ చేసి "పాతిక లక్షలు.. ఎవరి పేర్లూ బయటకు రాకూడదు" అన్నాడు చలపతితో.
"పాతిక లక్షలా! జీవితాంతం నీకు ఊడిగం చేస్తాను" ఆనందంతో అన్నాడు చలపతి.
ఆ యువతి చలపతి ఎదురుగానే చందూని గట్టిగా హత్తుకుంది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/2tEfuuXbLzg